Kasturi Vijayam
EWS - Reservationlani Antham Chese Kutra (Telugu)
EWS - Reservationlani Antham Chese Kutra (Telugu)
రిజర్వేషన్] అంటే అదనపు అవకాశం. ఈ అసమానతల దేశంలో అనాదిగా అవకాశాలను దూరం చేయడమే గాక దోపిడీకీ, వివక్షకూ గురిచేయబడిన కులాధారిత వ్యవస్థలో కిందికులాలకు సామాజికంగా, విద్యాపరంగా అవకాశాలు కల్పించడంతో ఆర్థిక, రాజకీయరంగాలలో ప్రాతినిధ్యం కల్పించడం తద్వారా ప్రజాస్వామ్యాన్ని అర్థవంతం చేయడం కోసం రిజర్వేషన్లు ఏర్పాచేయడమైంది. రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్] ప్రాతిపదికగా వచ్చిన రిజర్వేషన్లు, న్యాయస్థానాల తీర్పులు, పార్లమెంటు చట్టాలు, పరిపాలనా విధానాల మీదుగా విస్తరించి ఇప్పుడీస్థితిలో వున్నాయి.ఇక్కడ కీలక విషయం ఏమంటే, అందరూ అనుకునేటట్లు రిజర్వేషన్లు ఆర్థిక సదుపాయాలు కాదు, వాటికోసమైతే రిజర్వేషన్లు అవసరం లేదు, పేదరిక నిర్మూలనా పథకాలు సరిపోతాయి. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను గుర్తిస్తూ 124వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టబడి పార్లమెంటుచే ఆమోదింపబడి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా రికార్డుస్థాయిలో రూపొందించబడి వెనువెంటనే అమలులోకి వచ్చింది. అన్ని పార్టీలు మూకుమ్మడిగా మద్దతిచ్చిన ఈ చట్టం తాలూకు చెల్లుబాటు గురించి ప్రాధమిక అభ్యంతరాలు ఎవరూ పట్టించుకోలేదు, అత్యంత వేగంగా అంటే
| Author: Sreevani Siddharthi Subhas Chandrabose |
| Publisher: Kasturi Vijayam |
| Publication Date: Mar 26, 2023 |
| Number of Pages: 144 pages |
| Binding: Paperback or Softback |
| ISBN-10: 819622916X |
| ISBN-13: 9788196229160 |